నీ అవార్డ్ నువ్వే తీసుకోరా! – 3


“షాక్మీర్‌లో ఉగ్రవాదం 1983 నుంచే పొడ చూపినా, 1990కి తీవ్ర రూపం దాల్చింది. దాని ధాటికి షాక్మీర్‌లో నివసించే పండిట్‌లు వ్యాలీని విడిచి పారిపోవాల్సి వచ్చింది. దాదాపు 300,000 వరకు ఉన్న పండిట్ల సంఖ్య, ఒకే సారి 3,000కి పడిపోయింది. ఇలాంటి ethnic cleansing జరుగుతూంటే మన మేధావులు వారి అవార్డులు వాపస్ ఇచ్చారా?”

“అబ్బే అప్పట్లొ ఈ ట్రెండ్ లేదనుకుంటానండి,” అన్నారు కేశవరావు గారు.

“అవును ఇది ముమ్మాటికి కొత్త ట్రెండే. అలాగే మొన్నటికి మొన్న ఉత్త ప్రదేశ్‌లో మజాఫర్ నగర్‌లో అహ్మదీయులు సింధువుల మధ్య మత కలహాలు జరిగినప్పుడు, అహ్మదీయులు చాలా మంది చనిపోయినప్పుడు, ఈ మేధావులు ఎందుకని తమ అవార్డులు తిరిగి ఇవ్వలేదంటారు?”

“అంటే ఉత్త ప్రదేశ్‌లో అధికారంలో ఉన్నది ముభావం సింగ్ పార్టీ కద. ఆయన్ని వీళ్ళు ఎలా నిలదీస్తారు?”

“భేష్! మీరు ఇప్పుడు చాలా క్లారిటీతో ఆలోచిస్తున్నారు.”

“థ్యాంక్యూ!”

“వీటన్నిటికే నిరసన ప్రకటించని వారు, 2002లో పోద్రాలో సింధువులు సజీవ దహనం అయినప్పుడు స్పందిస్తారని, 2008లో డుంబై్‌లో పీకిస్తాన్ ముష్కరులు దమనకాండ సాగించినప్పుడు ఖండిస్తారని అనుకోవడం అత్యాశే అవుతుంది. ఇలాంటి మేధావులకు తలమానికమైన అధోగతి రాయి మనం షాక్మీరు ప్రజలను రాచి రంపాన పెట్టడం మూలానే పీకిస్తాన్ దుండగులు డుంబై దాడులు చేసారని వాక్రుచ్చింది కూడా.”

“అన్నట్టు ఆవిడ కూడా అవార్ద్ తిరిగి ఇచ్చేసిందండోయి!”

“అసలు ఇంత ఆలస్యం చేయడమే ఆశ్చర్యం. ఈ ఐడియా తనకే ముందు ఎందుకు రాలేదని కుమిలిపోయి ఉంటుంది పాపం.”

“నిజమే. ఇప్పుడు నాకు పూర్తిగా క్లారిటీ వచ్చేసింది శంకర్రావు గారు. కేవలం మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, అంతర్జాతీయంగా హిండియా మత కలహాలతో అతల కుతలం అయిపోతుంది అన్న భావన తీసుకు రావడానికి, సిక్యులర్ శక్తులని బల పరచడానికే వీరి ప్రయత్నం అంతా. జే.బీ.పీ. ఎవరి సహాయం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఎంత దుష్ప్రచారం చేసినా సురేంద్ర మోడి ప్రధాన మంత్రి అయ్యాడని, కళ్ళల్లో నిప్పులు పోసుకుని, కడుపులో అల్సర్లు తెచ్చుకుంటున్నారు. ఈ మేధావులని ఏం చేస్తే బాగుంటుంది?”

“పెద్దగా ఏమీ చేయనక్కర లేదు. ఇంకో సారి ఈ డ్రామా ఆడడానికి వీళ్ళ దగ్గర ఎలాగూ అవార్డులు ఉండవు. పనిలో పనిగా వారికి అవార్డులతో పాటూ ఇచ్చిన రొక్ఖాన్ని కూడా, వడ్డితో సహా వాపస్ చేయమంటే తల్లీ బిడ్డ న్యాయంగా ఉంటుంది. ఇక ముందు ఎక్కడన్నా తమ పేరు ముందు ఈ అవార్డుని తగిలిస్తే, వెంటనే బొక్కలో తోస్తే ఇంకా ధర్మంగా ఉంటుంది.”

“ఇదేదో బాగుందే!”

This entry was posted in అతుకుల బొంత. Bookmark the permalink.

3 Responses to నీ అవార్డ్ నువ్వే తీసుకోరా! – 3

  1. kastephale says:

    >>>పనిగా వారికి అవార్డులతో పాటూ ఇచ్చిన రొక్ఖాన్ని కూడా, వడ్డితో సహా వాపస్ చేయమంటే తల్లీ బిడ్డ న్యాయంగా ఉంటుంది.>>>
    ‘ ఆ ఒక్కటీ అడక్కు :)’

  2. kamudha says:

    ఇక ముందు ఎక్కడన్నా తమ పేరు ముందు ఈ అవార్డుని తగిలిస్తే, వెంటనే బొక్కలో తోస్తే ఇంకా బాగుంటుంది. This should be done.

Leave a comment