నేను సింధువుని ఎట్లైత? – 1


హిండియాలో మేధావులకి కొరత లేదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఐతే గమనించ వలసిన విషయం ఏమిటి అంటే, మేధావులు కావడానికి మొదటి అర్హత, వారు “ఎర్ర” మంద కి చెంది ఉన్న వారు కావడం. (కాషాయం ధరించిన వారు ఎప్పటికి మేధావులు అనిపించుకోరు.) రెండో అర్హత, కళ్ళ ముందు కనపడుతున్న నిజాలని పట్టించుకోకుండా తమ అభిప్రాయాలు మాత్రమే మొక్కవోని శ్రద్ధతో ఇతరుల మీద రుద్దుతూ ఉండడం. ఐతే వీటన్నిటినీ మించిన అర్హత ఇంకొకటి ఉంది. అది వారు సింధువులలో చలిత వర్గానికి చెందిన వారు కావడం!

చలితుల్లో పుడితే చాలు, వాళ్ళు automaticగా మేధావులైపోతారు. వాళ్ళు ఏం చెప్పినా దానికి తిరుగు లేదు. వాళ్ళు సింధువుల దేవతలని ఎన్ని మాటలు అన్నా, సింధువులలో అగ్ర వర్ణాల వారు పూజించే ఏ ఆచారాన్ని అవహేళన చేసినా, ఇంత కంటే నీచ్ కుత్తే కమీనే పనులు ఏం చేసినా ( అవి ఏంటో, దుర్మార్గులైన అగ్ర వార్ణాల వారికి బాగా తెలుసు), వారి తప్పు లేదు. పైగా వాళ్ళని విమర్శిస్తే (అంత దమ్ము ఓట్ల కోసమే రాజకీయాలు చేసే మన పాలకులకి ఎలాగూ లేదనుకోండి), అది జాత్యహంకారమే అవుతుంది. దీనికి తిరుగు లేదు.

దీనికి కారణం, సింధువులలో అగ్ర వర్ణాల వారు, చలితులని ఎన్నో వందల ఏళ్ళు అణిచివేశారు. దానికి ప్రతిగా ఇప్పుడు అగ్ర వర్ణాలకు చెందిన సింధువులు, చలితులు వారిని ఎంత దూషించినా, ఆఖరికి అమ్మ నా బూతులు తిట్టినా ఏమీ చేయలేని పరిస్థితి. పై పెచ్చు చలితులని ఒక్క మాట అన్నా, అగ్ర వర్ణాల వారు చిప్ప కూడు తినడం ఖాయం.

మీలో కొందరికి అనిపించ వచ్చు. ఇది reverse discrimination ఏమో అని. కాని మన మేధావుల ప్రకారం ఇది అగ్ర వర్ణాల వారు తమ పూర్వీకులు చేసిన పాపానికి అనుభవిస్తున్న శిక్ష. ఎలాగైతే దైవ పుత్రుడు తన రక్తం చిందించి, తనను నమ్మిన ముందు తరాల వారందరిని (నమ్మని వాళ్ళు four ways express laneలో నరకానికి పోతారు లెండి), ఒకే దెబ్బతో రక్షించాడో, అలాగే తమ పూర్వీకులు చేసిన పాపాలకి, అగ్ర వర్ణాల వారు, చలితులు ఏమన్నా, ఏం చేసినా కిక్కురు మనకుండా ఉండాలన్నదే మన మేధావుల అభిప్రాయం.

మీ లాంటి, నా లాంటి సామాన్యులకి ఈ లాజిక్ అర్థం అయ్యే చాన్స్ లేదు. కానీ మన పక్క దేశం పీకిస్తాన్‌లోని ప్రజలకి ఈ లాజిక్ బాగా అర్థం అయ్యింది. (అందుకే మన మేధావులకి పీకిస్తాన్ అంటే అపరిమితమైన ప్రేమ.) పీకిస్తానులో ఇలాంటి న్యాయమే అమలు పరుస్తారు. అక్కడ ఒక వేళ ఎవరైనా అమ్మాయి మీద ఒక యువకుడు అత్యాచారానికి పాలు పడ్డాడు అనుకోండి, ఆ యువకుడిని శిక్షించరు. బదులుగా అత్యాచారానికి గురి కాబడ్డ అమ్మాయి అన్నయ్య, అత్యాచారం చేసిన యువకుడి చెల్లెలి పై తిరిగి అత్యాచారం చేస్తాడు. చెల్లికి చెల్లి, సారీ, చెల్లుకి చెల్లు అన్న మాట.

ఇప్పుడు అర్థమయ్యిందా, ఇది ఎంత న్యాయబధ్ధమైన విషయమో? ఏంటీ? ఇంకా అర్థం కాలేదా? అలా చేయడం దారుణం అంటారా? తప్పు చేయని వారిని శిక్షించడం ఇంకా పెద్ద తప్పు అంటారా? మీరు తప్పకుండా కాషాయం గ్యాంగ్‌కి చెందిన వాళ్ళే అయ్యుంటారు. అందుకే మీకు ఈ నీతి వొంట బట్టలేదు.

దీనికి తోడు, చలితులని అందలం ఎక్కించాలి అని మేధావులంతా కంకణం కట్టుకుని ప్రవేశ పెట్టిన deservationలు, ఇంకొక అద్భుతమైన సరిదిద్దు చర్య. అంటే, అత్తెసరు మార్కులు వచ్చినా (ఒకో సారి అవి రాకున్నా కూడా ఫర్లేదు), చలితులకి విద్యా సంస్థల్లో సీట్లు ఇవ్వడం, పని చేసే కనీస అర్హతలు లేకపోయినా, ఉద్యోగాల్లో అవకాశాలు ఇవ్వడం, చివరికి ఆ ఉద్యోగాల్లో ప్రమోషన్‌లు కూడా, అగ్ర వర్ణాల వారిని కాదని, చలితులకి ఇవ్వడమే, deservationల ఉద్దేశం.

దీని వల్ల కుల వివక్ష పోవడం మాట కార్ల్ మార్క్స్ ఎరుగు, ప్రతి ఒక్కరికి, వారి కులమే కాకుండా ఎదుటి వారి కులం ఏంటో తెలుసుకునే వెసులుబాటు ఏర్పడింది. ఈ రకంగా అందలం ఎక్కిన చలితులకి, సమాజంలో గౌరవం రావడం కాదు కద, వారందరిని ఎందుకూ చేత కాని వారిగా ఒకే గాట కట్టడం మొదలు అయ్యింది.

ఇలాంటిది ఊహించే, మన రాజ్యాంగ కర్త, ఒక ఇరవయి ఏళ్ళ తరువాత, deservationలని ఎత్తి వేయాలి అని సూచించాడు. ఐతే తీసేయడం మాట అటుంచి, ఈ deservationల శాతం ఇంకా ఇంకా పెరుగుతూ పోయింది. పులి మెడలో గంట విప్పే సాహసం చేయలేని మన రాజకీయ నాయకులు (ఎక్కువ మంది మళ్ళీ అగ్ర వర్ణాల వారే సుమా!), deservationలను వ్యతిరేకించే వారిని దేశ ద్రోహులని ముద్ర వేశారు.

ఐతే ఆశ్చర్యకరంగా మన హిండియా ఇన్ని వేర్పాటు శక్తులని, మేధావులని ఎదుర్కొని, అభివృద్ధి చెందుతూనే పోయింది. దీనికి కారణం సింధువులలోని స్మగ్లర్ కులమే. ఈ స్మగ్లర్ల వల్ల private sector నిలదొక్కుకుని ఎంతోమంది అర్హులకి (కులాలతో నిమిత్తం లేకుండా) ఉపాధి కల్పించింది. ఈ private sectorయే లేకుంటే పూజ్య హెన్రూ గారి socialism వల్ల మన హిండియా ఎప్పుడో పూర్తిగా భ్రష్టు పట్టి ఉండేది.

స్మగ్లర్లు అంటే నా ఉద్దేశం కేవలం ఆ కులంలో పుట్టిన వారు మాత్రమే కాదు, వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించే వారు ఎవరైనా నా దృష్టిలో స్మగ్లర్లే. నేను ఇలా ముందు అనుకునే వాడిని కాదు. కానీ మహా మేధావి ఐన చెంచా హౌలయ్య నా కళ్ళు తెరిపించాడు.

ఆయన దృష్టిలో వ్యాపారం చేయడం స్మగ్లింగ్‌తో సమానం. పరమ నీచమైన కార్యం.

(ఇంకా ఉంది)

 

This entry was posted in నేను సింధువుని ఎట్లైత?. Bookmark the permalink.

6 Responses to నేను సింధువుని ఎట్లైత? – 1

  1. Zilebi says:

    ఆహా ! చాలయ్య కతల
    యాహూ యని తీటగీతి యా! మేధో సిం
    ధూ! హాలికపుత్రునిటన్
    బాహాటమ్ముగ జిలేబి ఫట్ యనుటా ! హా!

    దేనికి దారి తీయునో యిది 🙂
    వేచి వున్నాము రాబోవు కాలమ్ కోసం !

    జిలేబి

  2. bonagiri says:

    “కళ్ళ ముందు కనపడుతున్న నిజాలని పట్టించుకోకుండా తమ అభిప్రాయాలు మాత్రమే మొక్కవోని శ్రద్ధతో ఇతరుల మీద రుద్దుతూ ఉండడం”

    ఈ విషయంలో కషాయం తాగించేవాళ్ళు కూడ తక్కువేమీ కాదు. ఈ ఇద్దరికీ కూడ వాళ్ళ వాదం గెలవడం ముఖ్యం కాని, మనుషులు, మానవత్వం ప్రధానం కాదు.

    • Murali says:

      🙂 రెండు గ్రూప్స్‌కి చాలా తేడా ఉంది. ఒకరు కషాయం తాగిస్తే, ఇంకొకరు ఏకంగా పచ్చి నెత్తురు (ఎరుపు అంటే ఇష్టం కద!) తాగుతారు.

      ఐనా ఇది మామూలే. మన దేశంలో చాలా సాధారణంగా జరిగే పని ఇది. ఒక ideologyని విమార్శిస్తే, వెంటనే దాని opposing ideology ని కూడా ఒక మాట అనేస్తారు. Neutral అనిపించుకోవాలన్న తపనతో.

      కషాయం గుంపు పొరపాట్లు చేయదని కాదు. కానీ, దేశాన్ని balakanize చేయాలనే ఏకైక ధ్యేయం ఉన్న ఎర్ర దళం, కషాయం గుంపు కంటే, ఎన్నో వందల రెట్లు ప్రమాదకరమైనది.

  3. “ఆయన దృష్టిలో వ్యాపారం చేయడం స్మగ్లింగ్‌తో సమానం. పరమ నీచమైన కార్యం.”
    దిక్కుమాలిన గిస్తకాలు రాయటంకంటే నీచనికృష్టకార్యమా అని!?

  4. bkrmaadhav says:

    నేను ఈ గిస్తకాన్ని చదివాను. ఇలాంటి వాళ్ళ వలన చలిత వర్గానికి లాభం కంటే నష్టమే ఎక్కువనిపిస్తుంది.

Leave a comment